పులివెందులలో సీబీఐ శోధన

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు చేధించడానికి సీబీఐ మరోమారు పులివెందులలో ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికి పైగా సీబీఐ

Published : 24 Jul 2020 13:49 IST

పులివెందుల: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు చేధించడానికి సీబీఐ మరోమారు పులివెందులలో ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికి పైగా సీబీఐ అధికారుల బృందం వివేకా హత్య జరిగిన ప్రదేశంలో అణువణువూ పరిశీలించింది. 

పులివెందుల టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సర్వేయర్లతో ఇంటి మ్యాప్‌ను సీబీఐ అధికారులు తయారు చేస్తున్నారు. వివేకా ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ ఆమె కుమార్తె సునీత దగ్గరుండి సీబీఐ అధికారులకు చూపించారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఓ గది తలుపు తెరుచుకుని ఉన్న విషయాన్ని సునీత.. సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగిన పడకగది, స్నానపు గదిని పరిశీలించారు. ఇంటిపైకెక్కి కూడా అధికారులు నిశితంగా పరిశీలించారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్న వాచ్‌మెన్‌ రంగన్నను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని