హజ్‌యాత్ర రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం హజ్‌ యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.

Published : 07 Nov 2020 18:50 IST

ఏపీకి చెందినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్‌సైట్‌ ప్రారంభించిన మంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హజ్‌ యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. హజ్‌ యాత్రీకుల కోసం హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో అన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌ను హోంమంత్రి ప్రారంభించారు. హజ్‌ యాత్రకు వెళ్లే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంతమేర ఖర్చులు చెల్లిస్తున్నామన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని.. లాటరీ విధానంలో యాత్రికులను ఎన్నుకుంటామని హోంమంత్రి వివరించారు. అయితే గతేడాది డబ్బులు చెల్లించి హజ్‌ యాత్రకు వెళ్లలేకపోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి చెప్పారు. 18 ఏళ్లలోపు, 65ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. కరోనా రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్లను వినియోగించాలని మంత్రి మహమూద్‌ అలీ సూచించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని