MI ఫోన్‌ కొనేదాకా పెళ్లి చేసుకోను

పెళ్లి చేసుకోను అని చెప్పడానికి చాలా మంది చాలా కారణాలు చెప్తారు. కానీ ఈ యువకుడు చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది. అదేంటంటే సెప్టెంబరులో ఎంఐ 10టి ప్రోను భారత్‌లో విడుదల చేసింది.

Published : 23 Dec 2020 02:29 IST

ఉచితంగా ఫోన్‌ ఇచ్చిన షావోమీ కంపెనీ

దిల్లీ: పెళ్లి చేసుకోను అని చెప్పడానికి చాలా మంది చాలా కారణాలు చెప్తారు. కానీ ఈ యువకుడు చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది. అదేంటంటే సెప్టెంబరులో ఎంఐ 10టి ప్రోను భారత్‌లో విడుదల చేసింది. ఆ ఫోన్‌ను కొనే వరకూ తాను పెళ్లి చేసుకోనని కమల్‌ అహ్మద్‌ అనే యువకుడు ట్విటర్‌లో సరదాగా ఓ పోస్టు పెట్టాడు. తరువాత షావోమీ కంపెనీ నుంచి సదరు ఫోన్‌ను ఉచితంగా సంపాదించాడు. దీనిపై షావోమీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆ ఫోన్‌ను అతడు ఉచితంగా సంపాదించాడన్నారు. అతడు ఎంఐ అభిమాని కావడంతో షావోమీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలైన ఎంఐ 10టి ప్రోను కొనేందుకు ఒక కూపన్‌ను సాధించడంతో ఆ ఫోన్‌ను ఉచితంగా పొందాడని తెలిపారు. చివరికి డిసెంబరు 21న అతడు ఆ ఫోన్‌ను అందుకున్నాడని వారు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆ ఫోన్‌ను చివరికి సాధించాను అని పోస్టు పెట్టాడు. సదరు ఫోన్‌ను కొనేందుకు అతడు ఇప్పటికే డబ్బులు దాచడం మొదలుపెట్టాడట. అతడు ఫోన్‌ను తీసుకున్న తర్వాత షావోమీ ఇండియా హెడ్ మనుకుమార్‌ జైన్‌ అతడి ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘‘ఇక ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమనుకుంటా..!!’’ అంటూ సరదాగా స్పందించారు. దీంతో ఈ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇవీ చదవండి..

ఒప్పో నుంచి స్లైడ్‌ ఫోన్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని