పులికాట్‌లో సందడి చేస్తున్న దేవతా పక్షులు

ఏటా వచ్చే విదేశీ అతిథులు నెల్లూరు జిల్లాకు మళ్లీ పర్యాటక శోభను తీసుకొచ్చాయి. పులికాట్‌ సరస్సులో కొత్త కాపురానికి వచ్చిన దేవతా పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి...

Published : 28 Nov 2020 23:20 IST

నెల్లూరు: ఏటా వచ్చే విదేశీ అతిథులు నెల్లూరు జిల్లాకు మళ్లీ పర్యాటక శోభను తీసుకొచ్చాయి. పులికాట్‌ సరస్సులో కొత్త కాపురానికి వచ్చిన దేవతా పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఏడు దేశాలకు చెందిన ఈ విహంగాలు వేల కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్‌ సరస్సుకు వస్తుంటాయి. పెలికాన్స్‌, గూడ బాతులు, కొంగలు వంటి 26 రకాల పక్షులు పులికాట్‌లో సందడి చేస్తాయి. ఐదు నెలలపాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేస్తాయి. తర్వాత పిల్లలతో సహా స్వదేశాలకు ప్రయాణమవుతాయి. ఈ ఐదు నెలల పాటు రైతులు, మత్స్యకారులు, అధికారులు వాటిని సంరక్షిస్తుంటారు. దేవతా పక్షులుగా పిలుస్తూ ఎవరూ వాటికి హాని కలగనీయకుండా చూస్తారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి సమీపంలోనే పులికాట్‌ ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణించేవారు పక్షుల సందడిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని