శ్రీశైలం ఘటన: బాధిత కుటుంబాలకు పరిహారం

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు, మిగతా మృతుల...

Updated : 21 Aug 2020 18:32 IST

హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు, మిగతా మృతుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

లోతైన విచారణ జరపాలి: ఉత్తమ్‌

శ్రీశైలం జలవిద్యుత్‌  కేంద్రంలో అగ్నిప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై లోతైన విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని