మోదీ@6 కోట్ల‌ ఫాలోవర్లు

సామాజిక మాధ్యమాల్లో అత్యధికమంది అనుసరించే ప్రపంచ నాయకుల్లో ప్రధాని నరేంద్ర  మోదీ ఒకరు. సోషల్‌ మీడియా ద్వారా మోదీ ఎప్పుడూ ప్రజలకు చేరువగా ఉంటారు. అందుకు తగ్గట్టు ఆయనకున్న

Published : 20 Jul 2020 01:49 IST

దిల్లీ : సామాజిక మాధ్యమాల్లో అత్యధికమంది అనుసరించే ప్రపంచ నాయకుల్లో ప్రధాని నరేంద్ర  మోదీ ఒకరు. సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఎప్పుడూ ప్రజలకు చేరువగా ఉంటారు. అందుకు తగ్గట్టు ఆయనకున్న ఆదరణ పెరుగుతూనే ఉంది. ట్విటర్‌లో తనను అనుసరించే వారి విషయంలో ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన మోదీ తాజాగా మరో మైలురాయి చేరుకున్నారు. ఆదివారం ట్విటర్‌లో మోదీని అనుసరించేవారి సంఖ్య 60 మిలియన్లను దాటడం విశేషం.

2009లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్‌ వినియోగించడం ప్రారంభించారు. అనతికాలంలోనే 2010లో ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 53 మిలియన్లను దాటింది.

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన మొదటి ముగ్గురు నేతల్లో ప్రధాని మోదీ ఒకరని 2018లో ఒక అంతర్జాతీయ సర్వే తెలిపింది. ట్విటర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 120 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు 84 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానం మన ప్రధానిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని