సీరం సర్వే-2 వివరాలు ప్రకటించిన ఎన్‌ఐఎన్‌ 

తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తిపై భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) కలిసి ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సీరం సర్వే ఫలితాలు విడుదలయ్యాయి...........

Published : 01 Oct 2020 18:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తిపై భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) కలిసి ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సీరం సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వివరాలను ఎన్‌ఐఎన్‌ విడుదల చేసింది. ఆగస్టు 26, 27 తేదీల్లో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో విడత సర్వే నిర్వహించినట్టు తెలిపింది. మూడు జిల్లాల్లో మొత్తం 1309 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షించినట్టు పేర్కొంది. జనగామలో 454 మందికి పరీక్షలు చేస్తే 83మందిలోనే వైరస్‌ ఉందని తెలిపింది. అలాగే, కామారెడ్డిలో 433 మందికి పరీక్షలు చేస్తే 30 మందిలో, నల్గొండ జిల్లాలో 422 మందికి పరీక్షలు చేస్తే 27 మందిలోనే వైరస్‌ ఉన్నట్టు తేలిందని వెల్లడించింది.

తాజాగా సేకరించిన శాంపిల్స్‌లో జనగామలో 18.2 శాతం, కామారెడ్డిలో 6.9శాతం, నల్గొండలో 11.1 శాతం మందికి వైరస్‌ సోకినట్టు తెలిపింది. ప్రజలు మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగతమైన శుభ్రత , భౌతికదూరం పాటించడం వల్ల వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా జరుగుతోందని గుర్తించినట్టు నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా మే నెలలో తొలిసారి సంయుక్తంగా  సర్వే చేసిన ఈ సంస్థలు అప్పటికి సామాజిక వ్యాప్తి లేదని వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని