Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రం చికిత్సకు స్పందిస్తున్నారు: ఏఐజీ ఆస్పత్రి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) చికిత్సకు స్పందిస్తున్నట్లు ఏఐజీ ఆస్పత్రి తెలిపింది.

Published : 17 Jan 2024 13:35 IST

హైదరాబాద్‌: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) చికిత్సకు స్పందిస్తున్నట్లు ఏఐజీ ఆస్పత్రి తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తమ్మినేని బీపీ కంట్రోల్‌లోనే ఉందని.. ప్రస్తుతం ఆయన మాట్లాడగలుతున్నారని పేర్కొంది. రానున్న 48 గంటలు ముఖ్యమని, వివిధ విభాగాల వైద్యులు కలిసి ఆయనకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించింది.

తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలోని తన స్వగృహంలో ఉన్న ఆయన ఉదయం ఛాతీ నొప్పితోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీకి తీసుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని