Andhra News: వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్ ఓఎస్డీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు.
ఈ నెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ.. ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో అతనితో పాటు కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
Ap-top-news News
CM Jagan: సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు.. ఇప్పుడు చిక్కులు..