గ్రామ, వార్డు సచివాలయాలకు పరిహారాల బాధ్యతలు

పలు పరిహారాల బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు విడుదల  చేసింది. వైఎస్సార్‌ బీమా, మత్స్యకార

Updated : 02 Jul 2021 00:01 IST

అమరావతి: పలు పరిహారాల బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు విడుదల  చేసింది. వైఎస్సార్‌ బీమా, మత్స్యకార భరోసా, పశునష్ట పరిహారం, రైతు ఆత్మహత్యల పరిహారాల బాధ్యతలను అప్పగించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల విభాగం నుంచి ఇదే తొలి జీవో. సంబంధిత జేసీల పర్యవేక్షణలో పరిహారాల అమలు ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో  పేర్కొంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని