Andhra Pradesh: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ మరోసారి కీలక భేటీ

ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ మళ్లీ సమావేశమైంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, ఐఆర్‌ రికవరీ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. సమావేశం పూర్తయ్యాక మంత్రుల

Updated : 05 Feb 2022 16:58 IST

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ మళ్లీ సమావేశమైంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, ఐఆర్‌ రికవరీ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. సమావేశం పూర్తయ్యాక మంత్రుల కమిటీ సీఎంను కలవనుంది. ఉద్యోగ సంఘాల నేతలను సీఎం వద్దకు తీసుకెళ్లనుంది. ఉద్యోగుల డిమాండ్లపై నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశం ఉంది. చర్చల్లో మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నానితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరఫున పీఆర్సీ సాధన కమిటీ సభ్యులు బండి శ్రీనివాసరావు, కె.ఆర్‌.సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని