APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ పార్సిల్‌ సేవలతో పాటు డోర్‌ డెలివరీ సదుపాయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) పార్సిల్‌ సేవలతో పాటు డోల్‌ డెలివరీ సేవలను అందుబాటులో తెచ్చామని ఏపీఎస్‌ఆర్టీసీ సహాయ మేనేజర్‌ (సరకు రవాణా) షేక్‌ అజ్మతుల్లా తెలిపారు.

Published : 25 Oct 2023 21:36 IST

ఇంటర్నెట్‌డెస్క: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) పార్సిల్‌ సేవలతో పాటు డోల్‌ డెలివరీ సేవలను అందుబాటులో తెచ్చామని ఏపీఎస్‌ఆర్టీసీ సహాయ మేనేజర్‌ (సరకు రవాణా) షేక్‌ అజ్మతుల్లా తెలిపారు. పార్సిల్‌ బుక్‌ చేస్తే ఏపీ పరిధిలోని 84 ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడికైనా (10 కిలోమీటర్ల పరిధిలో) డోర్‌ డెలివరీ సదుపాయం ఉంటుందని వివరించారు.

హైదరాబాద్‌ నుంచి ఏపీలోని 84 నగరాల్లో ఎక్కడికైనా డోర్‌ డెలివరీ సదుపాయం ఉంది. హైదరాబాద్‌లో మాత్రం డోర్‌ డెలివరీ సదుపాయం లేదని, కేవలం బుక్‌ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉందని అజ్మతుల్లా తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో మొత్తం 64 బుకింగ్‌ ఏజెన్సీలు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్టోబరు 26 నుంచి నవంబరు 25 వరకు ‘డోర్‌ డెలివరీ మాసోత్సవాలు’ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒక కేజీ పార్సిల్‌కు డోర్‌ డెలివరీ ఛార్జి రూ.15, ఆరు కిలోల వరకు రూ.30, పది కేజీల వరకు రూ.36,.. 25 కిలోల వరకు రూ.48, 25 కిలోల నుంచి 50 కిలోల వరకు రూ.59గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 7993081100 ఫోన్‌ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని