Bharat Biotech: మానవ వనరుల ఎగుమతుల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది: కృష్ణా ఎల్లా

మానవ వనరుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్‌ తొలిస్థానం దక్కించుకుంటుదని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్, ఎండీ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.....

Published : 21 Sep 2021 19:19 IST

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: మానవ వనరుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్‌ తొలిస్థానం దక్కించుకుంటుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్, ఎండీ కృష్ణా ఎల్లా అన్నారు. అమెరికా, జపాన్, చైనా, యూరప్ దేశాలు..తదితర దేశాల్లో ఎంతో మంది భారత యువ ఇంజినీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్‌టీసీసీఐలో మంగళవారం ఏర్పాటు చేసిన వాణిజ్య సప్తాహ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధి అనేది జీడీపీ వృద్ధిపై అధారపడి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ఉత్పత్తి, ఆవిష్కరణలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఆంగ్లం సరిగా మాట్లాడలేని చైనీయులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారని.. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వల్లే వారికి అది సాధ్యమైందని కృష్ణా ఎల్లా వివరించారు. మంచి డిగ్రీలు, జ్ఞానం ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేకపోవడంతో భారత్‌ వెనకపడుతోందని.. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాయని కృష్ణా ఎల్లా పేర్కొన్నారు.  భవిష్యత్తు అంతా పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ ఉండబోతుందని.. వ్యాధి నిరోధకశక్తిని పెంచేలా కార్టీసెల్‌ థెరపీ, ఎన్‌కే సెల్‌ థెరపీలు జరగనున్నాయని ఆయన వివరించారు. త్వరలో 3డీ మ్యానుఫ్యాక్చరింగ్‌ సాంకేతికత అందుబాటులోకి రానుందని ఇందుకోసం మార్గదర్శకాలు విడుదలయ్యాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని