గుంటూరు.. కాకుల మృతితో కలకలం

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం గుదిబండివారి పాలెంలో కాకుల మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరు కాకులు మృతి చెంది

Published : 07 Jan 2021 01:28 IST

కొల్లిపర: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం గుదిబండివారి పాలెంలో కాకుల మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరు కాకులు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా వచ్చిందేమో అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి ఈ ప్రాంతంలో కాకులు చనిపోతున్నాయని సమాచారం అందిందన్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న కోళ్ల ఫారాలను పరిశీలించామని.. ఎక్కడా వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నారు. కాకుల మృతిపై పరిశీలన చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిన తర్వాత వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

ఇదీ చదవండి..

బర్డ్‌ ఫ్లూ: రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని