CTET Exam: బుధ, గురువారాల్లో సీటెట్‌.. అభ్యర్థులూ ఇవి మరిచిపోవద్దు!

సీటెట్‌(CTET2022) పరీక్ష బుధ, గురువారాల్లో దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు..

Published : 28 Dec 2022 01:39 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) నిర్వహించే  కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-2022)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధ, గురువారాల్లో(ఈ నెల 28, 29 తేదీల్లో) దేశంలోని మొత్తం 243 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. దాదాపు 2.59లక్షల మందికి పైగా రాసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అడ్మిట్‌ కార్డు(admit cards)లను అందుబాటులో ఉంచిన అధికారులు.. ఆ కార్డులో పేర్కొన్న సమయానికి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎవరైనా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే ctet.nic.inవెబ్‌సైట్‌లో పొందొచ్చు.

అభ్యర్థులకు కీలక సూచనలు.. 

  • ఉదయం పరీక్ష రాసే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఆఖరి నిమిషంలో కాకుండా ఉదయం 7.30 గంటల కల్లా చేరుకోవాలి. సెకండ్‌ సెషన్‌లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులైతే  మధ్యాహ్నం12 గంటల కల్లా చేరుకోవాలి.
  • అడ్మిట్‌ కార్డును వెంట తీసుకురావడం మరిచిపోవద్దు. సీటెట్‌ 2022 అడ్మిట్‌ కార్డు లేకుండా పరీక్ష హాలులోకి అనుమతించరు.
  • అడ్మిట్‌ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి. ఓటరు ఐడీ, ఆధార్ కార్డు‌ ,డ్రైవింగ్ లైసెన్స్‌ వంటివి వెంట తెచ్చుకోవాలి.
  • వీటితో పాటు అభ్యర్థులు అదనంగా నీళ్ల బాటిల్‌, మాస్కు, శానిటైజర్‌, గ్లౌజులు తెచ్చుకోవచ్చు.
  • పరీక్ష హాలులోకి ఎలక్ట్రానిక్‌/కమ్యూనికేషన్‌ పరికరాలకు అనుమతిలేదు. మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లు, మైక్రోఫోన్‌లు, హెల్త్‌బ్యాండ్‌లతో పాటు వాచ్‌,వ్యాలెట్‌, కళ్లద్దాలు, హ్యాంండ్‌ బ్యాగ్‌లు, కృత్రిమ ఆభరణాలతో వస్తే అనుమతించరు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. 

ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం

తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని