Betavolu RamaBrahmam: బేతవోలు రామబ్రహ్మంకు కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ అవార్డు

 ప్రముఖ రచయిత బేతవోలు రామబ్రహ్మం కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

Published : 27 Jun 2023 18:47 IST

విశాఖపట్నం: ప్రముఖ రచయిత బేతవోలు రామబ్రహ్మం కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు, తామ్రపత్రాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అందించనుంది. సంస్కృతం, తెలుగు భాషల్లో ఆయన పలు రచనలు చేశారు. 34కు పైగా భాష, వ్యాకరణ గ్రంథాలు రాశారు. 1948లో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించిన ఆయన గతంలో అనువాదంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని