CJI: ఎన్టీఆర్‌ మనిషిగా ఉండటాన్ని గర్విస్తున్నా: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందిస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆయన జనం నాడి తెలిసిన

Published : 09 Jun 2022 15:01 IST

తిరుపతి: ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందిస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని.. పార్టీ ప్రారంభించిన తర్వాత నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీజేఐ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు విశేష సేవలందించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు.

‘‘ఎన్టీఆర్‌తో కొంత సాన్నిహిత్యం ఉంది. 1989 నుంచి ఎన్టీఆర్‌ మనిషిగా నాపై ముద్ర వేశారు. ఆయన మనిషిగా ఉండటాన్ని నేను గర్విస్తున్నా. రాజకీయ పార్టీకి సిద్ధాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహనీయుడు ఎన్టీఆర్. పదవీ విరమణ తర్వాత ఆయనపై పుస్తకం రాస్తా. తన స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవ కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని