CM KCR: రాష్ట్రాభివృద్ధి వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి: కేసీఆర్
రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కలిసి పని చేయాలని మార్గనిర్దేశం చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కలిసి పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఈమేరకు ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయని.. రాష్ట్రాభివృద్ధి వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో నాణ్యమైన వసతులు అందుబాటులోకి వచ్చాయన్న కేసీఆర్.. ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వాస్పత్రులు నేడు రద్దీగా మారాయని చెప్పారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. దాదాపు 30లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి రాబడులు పెరగడంతో ఆర్థిక వనరులు పెరిగాయని, అందువల్ల అభివృద్ధికి అనుగుణంగా యంత్రాంగం పని చేయాలని సూచించారు.
గొర్రెల పెంపకంలో రాజస్థాన్‌ను మించిపోయాం
గొర్రెల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం రాజస్థాన్‌ను మించిపోయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. తొలివిడతలో రూ.5 వేల కోట్లతో 3.94లక్షల మందికి 82.74 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు సీఎం గుర్తు చేశారు. రెండో విడతలో 3.50 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 6,125 కోట్ల వ్యయంతో 73.50 లక్షల గొర్రెల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తాజాగా గొర్రెల యూనిట్ విలువను రూ.1,25,000 నుంచి రూ.1,75,000 పెంచినట్లు చెప్పారు. తెలంగాణలో మాంసం వినియోగం గణనీయంగా పెరిగిందని, జాతీయ స్థాయిలో సగటు మాంసం వినియోగం 5.4 కేజీలు ఉంటే.. తెలంగాణలో 21.17 కిలోలు ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రానికి మాంసం దిగుమతులు తగ్గాయన్నారు. ఈ పథకం ద్వారా పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఒక్కో గొర్రెకు రూ.5వేలు, పొట్టేలుకు రూ.7వేల బీమా వర్తిస్తుందని, పది రోజుల్లోనే ఈ మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతుందని చెప్పారు. మరోవైపు వాటికి దాణా విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. గొర్రెల యూనిట్లతో గొల్ల కుర్మల జీవనోపాధి పెంపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని కేసీఆర్ అన్నారు.
నిజామాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాలి
అంతకుముందు నిజామాబాద్‌లో అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నిజామాబాద్ జిల్లాను అద్భుతంగా తీర్చి దిద్దాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో అభివృద్ధి పనులను పూర్తి చేసేట్లు చూడాలని స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు కార్యాలయాలను ఖాళీ చేశాయని, ఆ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కేటీఆర్ సీఎంకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటర్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!