Revanth Reddy: కేంద్రంతో ఘర్షణ వైఖరి.. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం: సీఎం రేవంత్‌

కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Updated : 04 Mar 2024 12:38 IST

ఆదిలాబాద్‌: కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులను సోమవారం ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్‌ తమిళిసై, సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కంటోన్మెంట్‌ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి పెద్దన్నలా మోదీ సహకారం అందించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని