రాయలసీమ ఎత్తిపోతలపై ధిక్కరణ పిటిషన్‌

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ)

Updated : 12 Jul 2021 15:29 IST

హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు ప్రస్తావించారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై విచారణను ఎన్జీటీ ఇవాళ్టికి వాయిదా వేసింది. కానీ, ఇవాళ విచారణకు రాకపోవడంతో తాము కూడా ధిక్కరణ పిటిషన్‌ వేశామని ఏఏజీ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. గత ఎన్జీటీ ఆదేశాల ప్రకారం కేఆర్‌ఎంబీ, కేంద్రపర్యావరణ శాఖ అధికారులు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించి నేడు నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ, ఏపీ ప్రభుత్వం తనిఖీ చేయకుండా అధికారులను అడ్డుకోవడంతో ఇంతవరకు ఆ విభాగాలు నివేదిక ఇవ్వలేదని ఏఏజీ ఎన్జీటీకి తెలిపారు. స్వయంగా ఎన్జీటీనే రంగంలోకి దికి ప్రాజెక్టును తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం వేసిన ధిక్కరణ పిటిషన్‌ను జతచేసి విచారణ చేపట్టాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందని, జాబితా ప్రకారం ఈ నెల 23న విచారణ జరుపుతామని ఎన్జీటీ పేర్కొంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని