Ts HighCourt: వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలపై హైకోర్టు కీలక నిర్ణయం

రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది.

Published : 18 Dec 2023 20:12 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. 9 వేలకు పైగా వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం వసతులు కల్పించడం లేదని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం మార్గదర్శకాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన కోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని