Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/09/21)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 09 Sep 2021 04:06 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.మనశ్శాంతి లభిస్తుంది.శని శ్లోకం చదవండి.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గాస్తోత్రం పఠించాలి.

ప్రారంభించిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించినదాని కన్నా అధికధనలాభం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

 

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్యనమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యుభయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి.

మంచికాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని