Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/03/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం . అనవసర కలహ సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి . అనవసర ఖర్చలు వస్తాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గ ధ్యానం శుభప్రదం.
మంచి సమయం నడుస్తోంది . వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
కాలాన్ని మంచి విషయాలకై వినియోగించండి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మనస్సంతోషాన్ని ఇస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం
ధర్మసిద్ధి ఉంది . దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయి.
అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యవిషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్నివిషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్దతులను అవలంబించడం మంచిది. గోసేవ చేయడం మంచిది.
చిత్తశుద్ధి తో చేసేపనులు ఫలిస్తాయి . ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యంచేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీ స్తుతి పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
మీ మీ రంగాల్లో శ్రమతోకూడిన ఫలితాలుంటాయి . అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరిస్తారు . తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది .పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులవైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం మంచిది.
మంచి ఆలోచనలు, చిత్తశుద్ధితో విజయాన్ని అందుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి. విష్ణు సహస్ర నామాలు పారాయణ చేస్తే ఇంకా మంచిది.
మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. దుర్గ ధ్యానం శుభప్రదం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shaakuntalam: ఆమెకు శిక్షణ అవసరం లేదు.. తను పుట్టుకతోనే సూపర్ స్టార్: సమంత
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి