AP News: ఆ యాప్‌ ఉంటే చాలు.. బస్సు ప్రయాణం ఉచితం!

దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయనగరంలో మహిళలు .....

Updated : 23 Nov 2022 10:28 IST

విజయనగరం పోలీసులు వినూత్న కార్యక్రమం

విజయనగరం: దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయనగరంలో మహిళలు తమ మొబైల్ ఫోన్‌లలో దిశా యాప్‌ను చూపిస్తే.. పట్టణంలోని ముఖ్య కూడళ్ళ నుంచి ఇతర ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు. ఇందుకోసం పోలీస్‌ శాఖ రెండు బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. శనివారం విజయనగరంలో దిశా యాప్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం సీఎం జగన్‌ ఈ గొప్ప యాప్‌ను తీసుకొచ్చారన్నారు.

ప్రతి మహిళా తనను తాను రక్షించుకునేందుకు ఇదో ఆయుధంలా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉండాలని, ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు. అనంతరం కళ్యాణ మండపం నుంచి దిశా పోలీసు స్టేషను వరకు దిశా యాప్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కె.శ్రావణి, పోలీసు అధికారులతో పాటు మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని