Hyderabad: కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై ఆందోళన వద్దు: ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

నగరంలో ప్రస్తుతం కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫీవర్‌ ఆసుపత్రి సూరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు.

Published : 21 Dec 2023 18:51 IST

హైదరాబాద్‌: నగరంలో ప్రస్తుతం కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫీవర్‌ ఆసుపత్రి సూరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భిణులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు జేఎన్.1 (కొవిడ్‌) వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. కొవిడ్‌ వైరస్‌ రూపాంతరం చెంది జేఎన్.1గా మారిందని, ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.

బుధవారం ఫీవర్‌ ఆసుపత్రిలో ఓపీకి వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చిందని, జేఎన్‌.1 అవునా, కాదా? అనేదాని కోసం ఆ నివేదికలను గాంధీ ఆసుపత్రికి పంపించామన్నారు. జేఎన్‌.1 ఎక్కువగా వ్యాప్తి చెందితే ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌, ఫీవర్‌ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశామని వెల్లడించారు. ప్రస్తుతం పండుగల సీజన్‌ ఉన్నందున.. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని