Tirupati: శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగుల బీభత్సం.. రైతుకు తీవ్ర గాయాలు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని చిన్న రామాపురం పంచాయతీ పరిధిలో ఉన్న యమాలపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో అర్ధరాత్రి దాటాక పంట పొలాలను ధ్వంసం చేశాయి.

Published : 14 Feb 2024 11:27 IST

చంద్రగిరి గ్రామీణం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని చిన్న రామాపురం పంచాయతీ పరిధిలో ఉన్న యమాలపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో అర్ధరాత్రి దాటాక పంట పొలాలను ధ్వంసం చేశాయి. కాపలాగా ఉన్న రైతు మనోహర్ రెడ్డిపైనా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన రైతును అటవీ శాఖ అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గత 20 రోజులుగా తరచూ రాత్రి వేళల్లో సుమారు 17 ఏనుగుల గుంపు పొలాలపై పడటంతో చేతికి అందివచ్చిన పంట చేజారిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులు భరించలేకపోతున్నామని.. ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తాయోనని వణికిపోతున్నామన్నారు. అవి అడవుల నుంచి గ్రామాల వైపు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని