Pregnancy: అమ్మా.. తొలి మూడు నెలలు జాగ్రత్త..!

కోడలో..కూతురో అమ్మయ్యిందంటే ఆ ఇంటిల్లిపాదికి సంతోషమే. ఇంటికి వారసులు వస్తారని ఆ అమ్మను అపురూపంగా చూస్తారు. కాలు కిందపెట్టనివ్వరు. గడప దాటనివ్వరు. తొలి మూడు నెలలు గర్భిణిని చాలా జాగ్రత్తగా చూస్తారు. అలా ఉంటేనే తొమ్మిది నెలలు దాటిన తర్వాత పండంటి బిడ్డకు అమ్మ అవుతుంది.

Published : 21 Aug 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోడలో.. కూతురో అమ్మయ్యిందంటే ఆ ఇంటిల్లిపాదికీ సంతోషమే. ఇంటికి వారసులు వస్తారని ఆ అమ్మను అపురూపంగా చూస్తారు. కాలు కిందపెట్టనివ్వరు. గడప దాటనివ్వరు. తొలి మూడు నెలలు గర్భిణిని చాలా జాగ్రత్తగా చూస్తారు. అలా ఉంటేనే తొమ్మిది నెలలు దాటిన తర్వాత పండంటి బిడ్డకు అమ్మ అవుతుంది. అయితే ఈ సమయంలో ఎలాంటి సమస్యలు వస్తాయి..? వాటికి పరిష్కార మార్గాలను గైనకాలజిస్టు డాక్టర్‌ శిరీష వివరించారు.

ఇవీ సమస్యలు

కొంతమందికి ఆకలి మందగించడం, వాంతులు కావడం సహజం. ఇలాంటి పరిస్థితి ఎదురైతే కొంచెంగా పలుమార్లు ఆహారం తీసుకోవాలి. మరికొందరికి రక్తస్రావం కూడా కనిపిస్తుంది. అబార్షన్‌ అయ్యిందని భయపడుతారు. తల తిరిగినట్టు అనిపిస్తుంది.

ఈ నెలల్లో అప్రమత్తం

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడొద్దు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. బయటి ఆహారం తినడం మంచిది కాదు. జ్వరం వస్తే చికిత్స చేయించుకోవాలి. ఈ సమయం చాలా సమస్యాత్మకమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. అల్లం వాడితే వాంతులు తగ్గిపోతాయి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్‌ కాదు. విశ్రాంతి అవసరం లేదు. అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలి. 

ఈ పరీక్షలతో మేలు

గర్భిణులు రక్త పరీక్ష చేయించుకోవడంతో రక్తహీనత, హెపటైటీస్‌, హెచ్‌ఐవీ ఉంటే తెలిసిపోతుంది. తల్లీబిడ్డా ఎలా ఉన్నారో తెలుసుకోవచ్చు. సిఫిలిస్‌ పరీక్ష కూడా చేస్తారు. ఈ వ్యాధులు ఏవైనా ఉంటే ప్రత్యేక చికిత్స చేస్తే పుట్టే బిడ్డకు ఇబ్బందులుండవు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని