Gastric Cancer: గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా..? ఈ విషయాలు తెలుసుకోండి..!

మనం పద్ధతి ప్రకారం నడుచుకున్నపుడు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. దారి తప్పినపుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రాణాంతకమైన జబ్బులు కూడా అలాగే రానున్నాయి. గుండెపోటు, క్యాన్సర్‌ లాంటి వ్యాధులు మన తీరు మారడంతోనే పుట్టుకొస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.

Published : 25 Sep 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం పద్ధతి ప్రకారం నడుచుకున్నపుడు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. దారి తప్పినపుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రాణాంతకమైన జబ్బులు కూడా అలాగే రానున్నాయి. గుండెపోటు, క్యాన్సర్‌ లాంటి వ్యాధులు మన తీరు మారడంతోనే పుట్టుకొస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇష్టం వచ్చినట్టు తినడం, వ్యాయామం లేకపోవడంతో పొట్టకు చికాకు కలుగుతోంది. జంక్‌ ఫుడ్‌తో గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వస్తోందని సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ విజయ్‌ కోడూరు తెలిపారు. 

ఎందుకొస్తుందంటే...

ఎక్కువకాలం నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్‌ తినడంతో గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఉప్పు తినడంతో కూడా ప్రమాదం ఉంటుంది. పొగాకు వినియోగం, మద్యపానంతో కూడా వస్తుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది. వాంతులు కావడం, వాంతిలో రక్తం పడే లక్షణాలు కనిపిస్తాయి. పచ్చకామెర్లు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. 

ఏం చేస్తామంటే...!

గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ కణితిని ఆపరేషన్‌ చేసి తీసేయాల్సిందే. అవసరమయితే కిమో, రేడియోథెరపీ కూడా చేయకతప్పదు. సరయిన సమయంలో చికిత్స చేయించుకుంటే ప్రాణానికి ప్రమాదం ఉండదు. ఆహార పద్ధతులు సరిగా ఉండేలా చూసుకోవాలి. పండ్లుఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం చేస్తే ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉండదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని