మేడారానికి హెలికాప్టర్‌ సేవలు

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు.

Updated : 02 Feb 2020 20:17 IST

ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. ఆరుగురికి ప్రయాణానికి రూ.1.8 లక్షలతోపాటు అదనంగా జీఎస్టీ ఉంటుందన్నారు.  వీరికి ఇరువైపులా ప్రయాణంతోపాటు సమ్మక్క, సారలమ్మల దర్శనం కల్పిస్తామన్నారు. మరో రూ.2999 చెల్లిస్తే.. మేడారంలోని అన్ని ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా చూపిస్తామన్నారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

తెలంగాణలోని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని, ఇప్పటికే ప్రసిద్ధ రామప్ప దేవాలయం యునెస్కో బృంద పరిశీలనలో ఉందని శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని