బస్సు వెంట పులి.. సిబ్బందిపై వేటు!

ఛత్తీస్‌గఢ్‌లోని నందన్‌వన్‌ జంగిల్‌ సఫారీలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు సిబ్బందిని ఆదివారం విధుల నుంచి తొలగించారు. పర్యాటకులతో వెళ్తున్న బస్సును పులి వెంబడించడమే వారిపై చర్యలకు కారణం. రాయ్‌పూర్‌లోని నందన్‌వన్‌ జంగిల్‌

Updated : 16 Feb 2020 23:36 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నందన్‌వన్‌ జంగిల్‌ సఫారీలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు సిబ్బందిని ఆదివారం విధుల నుంచి తొలగించారు. పర్యాటకులతో వెళ్తున్న బస్సును పులి వెంబడించడమే వారిపై చర్యలకు కారణం. రాయ్‌పూర్‌లోని నందన్‌వన్‌ జంగిల్‌ సఫారీలో శుక్రవారం పర్యాటకుల బస్సు సంచరిస్తుండగా.. ఓ పులి బస్సు వెంట పడింది. అనంతరం బస్సు కిటికీకి ఉన్న కర్టెన్‌ను లాగేసింది. వెంటనే భయపడిపోయిన ఓ ప్రయాణికుడు తొందరగా వెళ్లాలని డ్రైవర్‌కు సూచించచడంతో బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు పులి వెంట పడే వరకు ఏం చేస్తున్నారని పేర్కొంటూ బస్సు డ్రైవర్, టూరిస్ట్‌ గైడ్‌ను విధుల నుంచి తొలగించారు. 

సఫారీకి వెళ్లినపుడు పర్యాటకులు, జంతువుల భద్రత గురించి సిబ్బందికి శిక్షణ ఇస్తామని, అయినప్పటికీ వీరు భద్రతా ప్రమాణాల్ని పాటించలేదని సఫారీ డైరక్టర్‌ మెర్సీ బెల్లా అన్నారు. ఈ వీడియో గైడ్‌ తీసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అందుకే వారిని విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని