హాల్‌టికెట్‌ రూపంలో పెళ్లి పత్రిక!

ఓ జంట తమ వివాహ వేడుకల సందర్భంగా విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు వినూత్న ప్రయత్నం చేశారు.

Published : 19 Feb 2020 00:47 IST

విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు జంట వినూత్న ప్రయత్నం

బెళగావి: ఓ జంట తమ పెళ్లి పత్రికను హాల్‌టికెట్‌ రూపంలో ముద్రించి ఆందరి దృష్టిని ఆకట్టుకుంది. కర్నాటక రాష్ట్రంలోని బెళగావికి చెందిన పార్వతి, బసవరాజ అనే వధూవరులు ... తమ వివాహ వేడుకల సందర్భంగా విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న పాఠశాల, కళాశాల పరీక్షల పట్ల విద్యార్థుల భయం పోగొట్టాలని ఈ విధంగా శుభలేఖలు ముద్రించినట్టు వారు తెలిపారు. హాల్‌టికెట్‌ నమూనాలో ముద్రించిన తమ వివాహ పత్రికతో బంధుమిత్రులను ఆహ్వానించి... జీవితంలో అన్ని పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్నిచ్చారు. సామాజిక సందేశంతో ముందడుగు వేసిన ఈ జంట ఈ సోమవారం ఒక్కటయ్యింది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని