‘పేజీలు తిప్పడానికి వేలిని ఉమ్ముతో తడపొద్దు’

చాలా కార్యాలయాల్లో అధికారులు పేజీలు మలిపేటప్పుడు చేతి వేలిని ఉమ్ముతో తడిచేయడం చూస్తూ ఉంటాం. నిజానికి ఇది ఆరోగ్యకరమైన అలవాటేమీ కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని........

Published : 24 Feb 2020 12:40 IST

ఉద్యోగులకు రాయ్‌బరేలీ జిల్లా సీడీవో ఆదేశాలు

లఖ్‌నవూ: చాలా కార్యాలయాల్లో అధికారులు పేజీలు మలిపేటప్పుడు చేతి వేలిని ఉమ్ముతో తడిచేయడం చూస్తూ ఉంటాం. నిజానికి ఇది ఆరోగ్యకరమైన అలవాటేమీ కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా యంత్రాంగం అధికారులతో ఈ అలవాటును మాన్పించాలని నిర్ణయికుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పేజీలు తిప్పేటప్పుడు ఎవరూ వేలికి ఎవరూ ఉమ్మును అద్దుకొవద్దని స్పష్టం చేసింది. ‘‘పేజీలు తిప్పడానికి అధికారులు, ఉద్యోగులు వేలిని ఉమ్ముతో తడిచేసుకోవడం గమనించాం. దీని వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి, జిల్లా స్థాయి, బ్లాక్‌ స్థాయి అధికారులంతా తడి కోసం వాటర్ స్పాంజిలను వాడాలని సూచిస్తున్నాం. వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ప్రతి కార్యాలయం దీన్ని తప్పకుండా ఆచరించాలి. అలాగే ఏ మేరకు అమలవుతుందో మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలి’’ అని రాయ్‌బరేలీ జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి(సీడీవో) ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని