ఆ విషయం దాచడం తప్పు: ఏపీ డీజీపీ

విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌ తీసుకోకుండా ఇతర ప్రదేశాల్లోకి తిరగడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌...

Updated : 28 Mar 2020 18:50 IST

విజయవాడ: విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌ తీసుకోకుండా ఇతర ప్రదేశాల్లోకి తిరగడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. విదేశాలకు వెళ్లి రావడం తప్పు కాదు.. ఆ విషయం దాచడం తప్పని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి వారు హోం క్వారంటైన్‌ తీసుకోవాలని సూచించారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో లాక్‌డౌన్‌ అమలు పరిస్థితిని శనివారం డీజీపీ సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలంతా పోలీసులకు సహకరించాలని డీజీపీ అన్నారు. పరిస్థితిని ప్రజలంతా అర్థం చేసుకోవాలని, ప్రజల రక్షణ కోసమేనని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరిస్తేనే కరోనాను అరికట్టగమని చెప్పారు. నిత్యావసర సరకులను తరలించే వాహనాలను ఆపబోమని తెలిపారు. త్వరలో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సవాంగ్‌ చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు గుంటూరు, అమరావతితో ఉన్నారని తెలిసిందన్నారు. విదేశాలకు వెళ్లి రావడం తప్పుకాదు.. ఆ విషయాలను దాచడం తప్పు అని అలాంటి వారినుద్దేశించి డీజీపీ వ్యా్ఖ్యానించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని నాలుగు వేల మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు దాటే విషయంలో కేంద్రం ఆదేశాలు పాటిస్తున్నామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని