ఈ ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసూ లేదు తెలుసా!

కొవిడ్‌-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదట ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ముగియడంతో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ఉదయం ప్రసంగించారు. రాష్ట్రాలు కోరడంతో లాక్‌డౌన్‌ను మే3 వరకు పొడగిస్తున్నామని ప్రకటించారు....

Published : 14 Apr 2020 18:32 IST

ముంబయి: కొవిడ్‌-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదట ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ముగియడంతో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ఉదయం ప్రసంగించారు. రాష్ట్రాలు కోరడంతో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నామని ప్రకటించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలి, దామన్‌, దియు, సిక్కింలో ఏ ఒక్కరూ ఈ వైరస్‌ బారిన పడకపోవడం గమనార్హం. మేఘాలయా, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో కేసు మాత్రమే నమోదైంది. పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంది.

దేశవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నానికి 10,752 కొవిడ్‌ కేసులు నమోదవ్వగా 361 మంది మృతిచెందారు. 1226 మంది వ్యాధి నయమై ఇంటికి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో 2,455 కేసులతో అగ్రస్థానంలో ఉంది. దేశంలోని కొవిడ్‌ బాధితుల్లో 22.8 శాతం మంది ఇక్కడే కావడం గమనార్హం. దిల్లీ (1510), తమిళనాడు (1173)లో వెయ్యి కేసులు దాటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని