ప్రత్యేక రైలులో 1100 మంది వలస కూలీలు

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో...

Updated : 01 May 2020 12:43 IST

సంగారెడ్డి అర్బన్‌ : లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు.  సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌ వద్ద చిక్కుకు పోయిన వలస కార్మికులను ఎట్టకేలకు స్వస్థలాలకు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు అనుగునంగా 1100 మంది వలస కార్మికులను శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 బస్సుల్లో లింగంపల్లి తరలించారు. 

లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి వారిని  రైలులో ఝార్ఖండ్‌కు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి ఎమ్‌.హన్మంతరావు, రెవెన్యూ , పోలీసు యంత్రాంగం చప్పట్లు కొట్టి వారికి వీడ్కోలు పలికారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ వలస కార్మికులు కంది ఐఐటీ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని