తగ్గిన వంటగ్యాస్ ధర.. ఎక్కడ ఎంతో తెలుసా?

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనమైన వేళ సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 162.50 మేర తగ్గింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో చమురు ధరలు పడిపోగా.. వరుసగా మూడో నెలలో

Published : 02 May 2020 00:39 IST

హైదరాబాద్‌: అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనమైన వేళ సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 162.50 మేర తగ్గింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో చమురు ధరలు పడిపోగా.. వరుసగా మూడో నెలలో సబ్సిడీయేతర వంటగ్యాస్‌ ధరలు తగ్గాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర దిల్లీలో రూ. 581.50కు తగ్గింది. గత ఏడాది జనవరిలో సిలిండర్‌ ధర రూ. 150.50 తగ్గగా.. ఇప్పుడు రూ.162.50 మేర తగ్గింది. గత మూడు నెలల్లో సబ్సిడీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌కు రూ. 277 వరకు తగ్గిందని ఎల్పీజీ సంస్థలు తెలిపాయి.

తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ. 207 వరకు తగ్గనుంది. గత నెల రూ. 796.50గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్‌ ధర తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ. 589.50కి చేరింది. తగ్గిన ధర ఇవాళ్టి నంచి అమల్లోకి వస్తుందని.. వచ్చే 15 రోజుల వరకు తగ్గిన ధర అమల్లో ఉంటుందని చమురు సంస్థలు ప్రకటించాయి.

తెలంగాణలో తాజాగా తగ్గిన ధరలు..
అదిలాబాద్‌లో రూ.213, జిగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో రూ.213.50, కామారెడ్డిలో రూ.213, యాదాద్రి భువనగరిలో రూ.207, భద్రాద్రి కొత్తగూడెంలో రూ.190.50 లెక్కన ధర తగ్గింది. మిగిలిన జిల్లాల్లో కూడా రూ.140కి తక్కువ కాకుండా ధర తగ్గినట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో తాజాగా తగ్గిన ధరలు..
అనంతపురంలో రూ. 214,  చిత్తూరులో రూ. 186, కడపలో రూ.208, తూర్పుగోదావరిలో రూ.179, గుంటూరులో రూ.180, కృష్ణలో రూ.183.50, కర్నూలులో రూ.205.50, నెల్లూరులో రూ.176.50, ప్రకాశంలో రూ.190.50, శ్రీకాకుళంలో రూ.179.50, 
విజయవాడలో రూ.74, విశాఖపట్నంలో రూ.192, విజయనగరంలో రూ.172, పశ్చిమగోదావరిలో రూ.190.50 చొప్పున తగ్గినట్లు అధికారులు తెలిపారు. 
గ్యాస్‌ నిల్వ కేంద్రాలు, గ్యాస్‌ రవాణా తదితర ఛార్జీలను పరిధిలోకి తీసుకున్నాక వివిధ జిల్లాలు, ప్రాంతాల మధ్య వంటగ్యాస్‌ ధరలో వ్యత్యాసం ఉంటుందని అధికారులు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని