6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్‌ఐవీ రోగి

కరోనా మహమ్మారి బారి నుండి అత్యంత తీవ్రమైన రోగాల బారిన పడ్డవారు సైతం కోలుకుంటుండడం ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల ఓ క్యాన్సర్‌ రోగి కరోనాను జయించిన విషయం తెలిసిందే.....

Updated : 27 May 2020 12:59 IST

దిల్లీ: అత్యంత తీవ్రమైన రోగాల బారిన పడ్డవారు సైతం కొవిడ్‌ నుంచి కోలుకుంటుండడం ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల ఓ క్యాన్సర్‌ రోగి కరోనాను జయించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడు సైతం కరోనా నుంచి బయటపడ్డారు. అదీ కేవలం ఆరు రోజుల్లోనే. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు దిల్లీ నుంచి స్వస్థలమైన గోండాకు బయలుదేరాడు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే లఖనవూలోని కేజీఎంయూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స సమయంలో తాను అప్పటికే హెచ్‌ఐవీ మందులు వాడుతున్నట్లు తెలిపారు. అనంతరం జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్‌ కూడా సోకినట్లు తేలింది. తలకు బలమైన గాయం కావడంతో రెండింటికీ కలిపి సంయుక్తంగా చికిత్స అందించారు. చికిత్సకు చురుగ్గా స్పందించిన అతడు ఆరు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నాడు. తలకు శస్త్రచికిత్స చేయడంతో మానసిక సమస్య సైతం సమసిపోయిందని కేజీఎంయూ ఆస్పత్రి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెస‌ర్ ఎం.ఎల్‌.బి భట్ తెలిపారు. డిశ్చార్జికి ముందు రెండుసార్లు పరీక్షలు జరపగా.. కరోనా నెగిటివ్‌ వచ్చిందన్నారు. ప్రస్తుతం అతడు కోలుకొని ఇంటికి చేరినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని