ఒక్కో వార్డులో 500 పరీక్షలు: అసదుద్దీన్‌

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేలా ప్రోత్సాహించాలని మజ్లీస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు.

Updated : 12 Jul 2020 22:11 IST

హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేలా ప్రోత్సాహించాలని మజ్లీస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. పార్టీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో అసదుద్దీన్‌ ఒవైసీ సమావేశమయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారా కార్పొరేటర్లతో మాట్లాడారు. నగరంలోని ఒక్కో వార్డులో కనీసం 500 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని ఎంఐఎం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇందులో వృద్ధులు, గర్భిణులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని