‘సింహాలకు సోకింది కొవిడ్‌-19 కాదు’

జూ పార్కులో 8 సింహాలకు సంక్రమించిన వైరస్‌..

Updated : 07 May 2021 09:35 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: జూ పార్కులో 8 సింహాలకు సంక్రమించిన వైరస్‌.. మానవులకు సోకిన కొవిడ్‌-19 వైరస్‌ ఒకటి కాదని ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ పశు వైద్యశాల(నారాయణగూడ) సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ వార్తలు వచ్చాక, ఆసుపత్రికి పెంపుడు శునకాలు, ఇతర జంతువుల తాకిడి పెరిగిందా.. అని ‘న్యూస్‌టుడే’ ఆయన్ని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నారు. సాధారణ ఓపీనే నమోదవుతోందన్నారు. కరోనా శునకాలకు అంటుకుంటుందా అంటూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ‘సార్స్‌-2 వైరస్‌ల్లో కొవిడ్‌-19 ఒకటి.. ఇది మనుషులను పీడిస్తుంది. సింహాలకు వచ్చింది మాత్రం అది కాదు’ అని కేంద్రం నిర్ధారించిందని పేర్కొన్నారు. ‘కుక్కలకు కరోనా వైరస్‌ 20 ఏళ్లుగా ఉంది, టీకాలు వేస్తున్నాం, శునకాలకు, జంతువులకు సోకిన వైరస్‌ మనుషులకు సోకదని’ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని