Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం
సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగం జరిగింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది.
శ్రీహరికోట: సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మరో రాకెట్ ప్రయోగం జరిగింది. ఉదయం 10.42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.
భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్-01 మొదటిది. ఈ ఉపగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
* ఈ ఉపగ్రహంలో రుబిడియం అణుగడియారం ఉంది. ఈ టెక్నాలజీని భారత్ సొంతంగా అభివృద్ధి చేసింది. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో దీనిని నిర్మించారు. ఇటువంటి టెక్నాలజీ అతితక్కువ దేశాల వద్ద మాత్రమే ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు ఉపగ్రహాలు అటామిక్ క్లాక్ పనిచేయడం మానేయగానే డేటా పంపడం ఆపేస్తాయి. కచ్చితమైన ట్రాకింగ్‌ను కూడా అందించలేవు. 2018లో కూడా ఇలా పనిచేయని ఉపగ్రహాన్ని మరో శాటిలైట్ పంపి భర్తీ చేశారు. ప్రస్తుతం నాలుగు ఐఆర్‌ఎన్‌ఎస్ ఉపగ్రహాలు మాత్రమే లొకేషన్ సర్వీసులను అందిస్తున్నాయి.
* రెండో తరం నావిక్ ఉపగ్రహాలు ఎల్1 సిగ్నల్స్‌ను పంపగలవు. దీంతో ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు సహకరిస్తాయి. ఈ సిగ్నల్స్‌ను అమెరికా అభివృద్ధి చేసిన జీపీఎస్‌లో వినియోగిస్తున్నారు. ఫలితంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థలను తక్కువ విద్యుత్తు, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉన్న చిప్స్ అమర్చే పరికరాల్లో, పర్సనల్ ట్రాకర్లలో మరింత మెరుగ్గా వినియోగించుకొనే అవకాశం లభించనుంది.
* రెండో తరం నావిక్ ఉపగ్రహాలు 12 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం సేవలు అందించనన్నాయి. ప్రస్తుతం ఉన్న నావిక్ ఉపగ్రహాలు 10 ఏళ్లపాటు మాత్రమే సేవలు అందించగలవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి