‘ప్రశ్నించే గొంతును నొక్కేందుకు కుట్రలు’

ప్రజాసేవ చేస్తున్న తనను ఓడించడానికి భారాస నాయకులు డబ్బు సంచులతో వస్తున్నారని,  అధికార పార్టీ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు

Updated : 23 Sep 2023 05:51 IST

యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సీతక్క

ములుగు, న్యూస్‌టుడే: ప్రజాసేవ చేస్తున్న తనను ఓడించడానికి భారాస నాయకులు డబ్బు సంచులతో వస్తున్నారని,  అధికార పార్టీ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం ములుగులో నిర్వహించిన యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల మండలస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘డబ్బు సంచులకు ప్రజాసేవకు మధ్య పోటీ జరుగుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఐదేళ్ల కింద నిరుద్యోగ భృతి పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్‌ ఇప్పటికీ అమలు చేయలేదు. ప్రశ్నించే గొంతును నొక్కడానికి కుట్రలు జరుగుతున్నాయి. మిడతల దండులాగా భారాస నాయకులు వస్తున్నారు. ప్రజలు గమనించాలని’ అన్నారు. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ చేసిన మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, మండలాధ్యక్షుడు ఎండీ చాంద్‌పాషా, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్‌, నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి, నాయకులు మధు, వంశీకృష్ణ, లక్‌పతి, రాము, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని