Telangana News: విజయ డెయిరీ రైతులకు గుడ్‌న్యూస్‌

విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.

Updated : 29 Aug 2022 15:14 IST

రంగారెడ్డి: విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. లీటర్‌ గేదె పాల ధర రూ.46.69 నుంచి రూ.49.40కు, ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాడి గేదెలకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పడ్డాక లాభాల్లోకి వచ్చిందని మంత్రి తలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని