Rajamahendravaram: పట్టాలు తప్పిన గూడ్స్‌.. ఏపీలో 9 రైళ్లు రద్దు

రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్లను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో 9 రైళ్లు రద్దయ్యాయి.

Updated : 09 Nov 2022 19:57 IST

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.

గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బయల్దేరాల్సిన 9 రైళ్లు పూర్తిగా.. రెండు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డీఆర్‌ఎం ట్వీట్‌ చేశారు.

 రద్దయిన వాటిలో విజయవాడ నుంచి విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం,  విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. విజయవాడ- లింగంపల్లి (12805) రైలును 2 గంటల ఆలస్యంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు రైళ్లు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడుస్తుండటంతో ఈ ఉదయం విశాఖ రైల్వేస్టేషన్‌ బోసిపోయింది.  మరోవైపు రాజమహేంద్రవరం వద్ద పట్టాలకు మరమ్మతులు పూర్తవడంతో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌ క్లియర్‌ చేసి పంపించారు.

రద్దయిన రైళ్ల వివరాలివీ..


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని