హైదరాబాద్‌లో ఘనంగా యూఎస్‌ కాన్సులేట్‌ వార్షికోత్సవం.. త్వరలో కొత్త భవనంలోకి..

అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి త్వరలో మారిపోతున్న వేళ యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయ సిబ్బంది ఈ వేడుకల్లో సందడి చేశారు.

Published : 24 Oct 2022 18:05 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి త్వరలో మారిపోతున్న వేళ కార్యాలయ సిబ్బంది ఈ వేడుకల్లో సందడి చేశారు. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో గత 14 ఏళ్ల క్రితం ఇదేరోజు (2008 అక్టోబర్‌ 24న) యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో తొలిసారి అమెరికా జెండా ఎగిరింది. 300 మిలియన్ల డాలర్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన భవనం నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్న యూఎస్‌ కాన్సులేట్‌ సిబ్బందికి ఈ కార్యాలయంలో ఇదే ఆఖరి వార్షికోత్సవం కావడం గమనార్హం. హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో అమెరికా-భారత్‌ సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది. ఈ సందర్భంగా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నీఫర్‌ లార్సన్‌ వీడియోను విడుదల చేశారు. అలాగే, దీపావళి వేడుకల్ని సైతం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని