UPSC: ఐఎఫ్‌ఎస్‌ ఫలితాలు వెల్లడి.. బాపట్లకు చెందిన శ్రీకాంత్‌కు మొదటి ర్యాంకు

ఇండియన్‌ ఫారెస్టు సర్వీసు ఫలితాలు శనివారం సాయంత్రం విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 147 మంది ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు.

Updated : 01 Jul 2023 21:13 IST

హైదరాబాద్‌: ఇండియన్‌ ఫారెస్టు సర్వీసు (IFS) ఫలితాలు శనివారం సాయంత్రం విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 147 మంది ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైనట్టు యూపీఎస్సీ తెలిపింది. బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్‌ మొదటి ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన సాహితీరెడ్డి 48వ ర్యాంకు, తొగరు సూర్యతేజ 66వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్‌ఎస్‌కు సంబంధించి రాత పరీక్షలు గతేడాది నవంబర్‌లో, ఇంటర్వ్యూలు ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని