TS News: ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం... అంతర్జాలంలో హాల్‌టికెట్లు

తెలంగాణలో ఈనెల 6నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌

Published : 03 May 2022 01:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఈనెల 6నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్ష రాయవచ్చని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9లక్షల మంది విద్యార్థుల కోసం 1,443 పరీక్షా కేంద్రాలు, 25వేల మంది ఇన్విజిలేటర్లను సిద్ధం చేసినట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని ప్రైవేటు కళాశాలల వారు కొందరు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హాల్‌టికెట్‌ కోసం కళాశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా అంతర్జాలంలో అందుబాటులో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని