
గుడ్‌న్యూస్: రైళ్లలో ఆ సేవలు మళ్లీ ప్రారంభం
దిల్లీ: ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే ఈ- కేటరింగ్ సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. కొవిడ్-19 కారణంగా నిలిచిపోయిన ఈ సేవలను వచ్చే నెల నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నుంచి ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. తొలుత 30 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.
ప్రయాణికులు తాము కోరుకున్న స్టేషన్లలో కోరుకున్న ఆహారాన్ని సీట్ల వద్దకే అందించే కేటరింగ్ సేవలను ఐఆర్‌సీటీసీ 2014లో ప్రారంభించింది. కొవిడ్-19 ముందు రోజుకు 20వేల ఆర్డర్లు వచ్చేవి. దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా ఈ సేవలను మార్చి 22న నిలిపివేశారు. కొన్ని నెలలుగా ప్రత్యేక రైళ్ల పేరుతో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ-కేటరింగ్ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రిత్వ శాఖ అనుమతితో ఈ సేవలు ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. www.ecatering.irctc.com వెబ్‌సైట్ ద్వారా గానీ, 1323 నంబర్‌కు కాల్‌చేయడం ద్వారా గానీ, ఐఆర్‌సీటీసీ ‘ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్’ ద్వారా గానీ ఈ సేవలను పొందొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా అందిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.
ఇవీ చదవండి..
అన్ని మెసెంజర్లు ఒకే దాంట్లో!
‘కరోడ్‌పత్నీస్’.. ఈ సారి వాళ్లదే హవా!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు