ISRO: మరికొన్ని గంటల్లో పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం.. చెంగాళమ్మకు ఇస్రో ఛైర్మన్‌ ప్రత్యేక పూజలు

మరికొన్ని గంటల్లో పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 31 Dec 2023 22:59 IST

సూళ్లూరుపేట: మరికొన్ని గంటల్లో పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2024 కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.  పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. 

ప్రయోగానికి సంబంధించి సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతామని సోమనాథ్‌ తెలిపారు. కొత్త ఏడాదిలో ఎక్కువ ప్రయోగాలు చేస్తామని, విజయవంతం కావాలని  అమ్మవారికి పూజలు చేశామన్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 60వ ప్రయోగం అని ఇస్రో ఛైర్మన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని