Covid 19: జేఎన్‌ 1 ప్రభావం తక్కువే: డబ్ల్యూహెచ్‌వో

జేఎన్‌-1 అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించింది.

Updated : 20 Dec 2023 04:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్‌-1 (COVID subvariant JN.1) పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం  సూచించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వేరియంట్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌, పలువురు వైద్య నిపుణులు వెల్లడించారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇదే మాట చెబుతోంది. జేఎన్‌-1 అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని ప్రకటించింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించింది.

ఇప్పటి వరకు లభించిన ఆధారాలు, పరిశోధన ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై ఈ ఉపరకం ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పేర్కొంది. 

కేరళలోని తిరువనంతపురం జిల్లా కరకుళం ప్రాంతంలో నవంబరు 18న నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో 79 ఏళ్ల బాధితురాలికి కొవిడ్‌ సోకినట్లు వెల్లడైంది. ఆ నమూనాలో జేఎన్‌.1 ఉపరకం ఉన్నట్లు తేలింది. తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబరులో జేఎన్‌.1 ఉపరకం అమెరికాలో వెలుగు చూసింది. చైనా సహా పలు దేశాల్లో ఈ ఉపరకం కేసులు పెరుగుతున్నట్లు అంచనా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని