అద్భుతమైన జ్ఞాపక శక్తితో అబ్బురపరుస్తోన్న చిన్నారి

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, కుమట తాలూకాకు చెందిన రెండేళ్ల చిన్నారి ద్యుతి పసి ప్రాయంలోనే అద్భుత జ్ఞాపక

Published : 30 Jun 2021 23:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, కుమట తాలూకాకు చెందిన రెండేళ్ల చిన్నారి ద్యుతి పసి ప్రాయంలోనే తన జ్ఞాపక శక్తితో అబ్బుర పరుస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, మహిళలు, జంతువులు, పక్షులపేర్లు టకాటకా చెప్పి ఆశ్చర్యపరుస్తోంది. ఆంగ్ల వర్ణమాల, 1 నుంచి 10 వరకూ అంకెలు, ఇంగ్లీషు రైమ్స్‌, భగవద్గీత శ్లోకాలు, నెలలు, వారాల పేర్లు ముద్దుముద్దుగా చెప్పేస్తోంది. 280 అంతర్జాతీయ కంపెనీల లోగోలను గుర్తించగలుగుతోంది. ఫలితంగా అతి చిన్న వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తమ చిన్నారి అరుదైన ఘనతను సాధించండం పట్ల ద్యుతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని